గేల్‌ను తప్పించడం సబబే: వెటోరీ | putting out Chris Gayle aside is right decision: RCB coach Vettori | Sakshi
Sakshi News home page

గేల్‌ను తప్పించడం సబబే: వెటోరీ

Apr 17 2017 11:09 PM | Updated on Sep 5 2017 9:00 AM

గేల్‌ను తప్పించడం సబబే: వెటోరీ

గేల్‌ను తప్పించడం సబబే: వెటోరీ

క్రిస్‌ గేల్‌ను జట్టు నుంచి తప్పిం చడం సమంజసమేనని ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెటోరీ అభిప్రాయపడ్డాడు.

బెంగళూరు: విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ను జట్టు నుంచి తప్పిం చడం సమంజసమేనని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెటోరీ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ముగిశాక ఒక బౌలర్‌ కొరత ఉందని, జట్టు అవసరాల రిత్యా షేన్‌ వాట్సన్‌ ఆల్‌రౌండర్‌గా సరిపోతాడని భావించామని పేర్కొన్నాడు. దీంతో గేల్‌ స్థానంలో వాట్సన్‌ను కొనసాగిస్తున్నామని తెలిపాడు.

అయితే ఆదివారం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పుణే చేతిలో బెంగళూరు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు చివరి ఓవర్లలో ధారళంగా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియం బౌలర్లకు సహకరించగలదని వెటోరీ అశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement