దక్షిణాఫ్రికాతో మొహాలీ టెస్ట్ లో 150 పరుగుల మార్క్ దాటిన టీమిండియా
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇప్పటికే 150 పరుగులకు పైగా లీడ్ ఉండటంతో.. టాపార్డర్ బ్యాట్స్ మెన్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆట తొలి గంటలోనే ప్రొటీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. అంతకు ముందు రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 125 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.