జాతీయ అండర్-11 లో ప్రియాంక శుభారంభం | priyanka wins first game in under-11 national chess championship | Sakshi
Sakshi News home page

జాతీయ అండర్-11 లో ప్రియాంక శుభారంభం

Sep 2 2013 7:16 PM | Updated on Sep 1 2017 10:22 PM

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఇక్కడి లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన బాలికల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రియాంక... స్థానిక క్రీడాకారిణి కామ్యా నెగిపై విజయం సాధించింది.రెండో సీడ్ వంతిక అగర్వాల్ (ఢిల్లీ)... శ్రుతి కకార్ (ఢిల్లీ)పై గెలుపొందింది.

 

ఓపెన్ కేటగిరీలో టాప్ సీడ్ రామ్ అరవింద్ (తమిళనాడు) తన రాష్ట్రానికే చెందిన పి. దర్శన్‌పై సునాయాస విజయం సాధించాడు. రెండో సీడ్ సౌరభ్ ఆనంద్... దెబంగా కలిట (అస్సాం)పై నెగ్గాడు. ఈ టోర్నమెంట్‌లో 26 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఓపెన్ కేటగిరీలో 181 మంది, బాలికల విభాగంలో 101 మంది బరిలోకి దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement