సీఎం విజయ్‌ టీమ్‌లోకి పవర్‌ఫుల్‌ పోలీస్‌ బాస్‌..! | DGP Mahesh Kumar Aggarwal set to take charge of TN police | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ టీమ్‌లోకి పవర్‌ఫుల్‌ పోలీస్‌ బాస్‌..!

May 30 2026 8:09 AM | Updated on May 30 2026 11:34 AM

DGP Mahesh Kumar Aggarwal set to take charge of TN police

సాక్షి, చెన్నై: తమిళనాడు పోలీస్‌ విభాగానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం కొత్త డీజీపీగా  మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను, ఇప్పటివరకు తమిళనాడు డీజీపీగా ఉన్న సందీప్‌రాయ్‌ రాథోడ్‌ స్థానంలో నియమించారు. 

క్లీన్‌ ఇమేజ్‌ అధికారి  
మహేష్‌కుమార్‌అగర్వాల్‌ తమిళనాడు పోలీస్‌ సర్వీసులో ఎంతో అనుభవం, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న సీనియర్‌ అధికారి. ఆయన 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రం. తండ్రి లాయర్‌ కావడంతో ఆయన కూడా లా చదివారు. ఆ తర్వాత సివిల్‌ సర్వీసెస్ పరీక్ష రాసి కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో తేని, తూత్తుకుడి జిల్లాల ఎస్పీగా, చెన్నై బ్రాడ్‌ వే డిప్యూటీ కమిషనర్‌గా, చెన్నై ట్రాఫిక్‌ సౌత్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 

సీబీఐలో సేవలు 
డెప్యుటేషన్‌పై తన సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు వెళ్లి, అక్కడ ఏడేళ్లు సీబీఐ  అధికారిగా పనిచేశారు. పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో పనిచేశారు. ఐజీగా పదోన్నతి పొందినానంతరం తమిళనాడుకు తిరిగివచ్చిన ఆయన సీబీసీఐడీలో పనిచేశారు. తర్వాత మదురై పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నై సౌత్‌ జోన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా, ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీజీపీగా పనిచేశారు. 2020లో చెన్నైకి అత్యంత పిన్న వయసు్కడైన పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి అప్పట్లో రికార్డు సృష్టించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement