breaking news
under-11 national chess championship
-
28 నుంచి చెస్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టు కోసం ఈనెల 28 నుంచి సెలక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. వరంగల్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో కాజీపేట్‌లోని బిషప్ బెరెట్టా పాఠశాల వేదికగా రెండు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తారు. అండర్–7, 9, 11 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీలో ప్రతి కేటగిరీలోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన బాలబాలికలు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 27లోగా తమ ఎంట్రీలను పంపించాలి. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. మరిన్ని వివరాలకు 90665 67567, 98494 94999, 94920 27919ను సంప్రదించాలి. 29 నుంచి రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి రాష్ట్రస్థాయి జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఎల్బీ స్టేడియంలోని టీఎస్‌సీఏ కార్యాలయంలో అండర్–19 బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్విస్ లీగ్ ఫార్మాట్లో పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు ఈనెల 28లోగా ఎంట్రీలను పంపించాలి. స్పాట్ ఎంట్రీలకు అనుమతి లేదు. వివరాలకు www.chesstelangana.com వెబ్సైట్లో లేదా 73375 78899, 73373 99299 నంబర్లలో సంప్రదించాలి. -
జాతీయ అండర్-11 లో ప్రియాంక శుభారంభం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చెస్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఇక్కడి లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన బాలికల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రియాంక... స్థానిక క్రీడాకారిణి కామ్యా నెగిపై విజయం సాధించింది.రెండో సీడ్ వంతిక అగర్వాల్ (ఢిల్లీ)... శ్రుతి కకార్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఓపెన్ కేటగిరీలో టాప్ సీడ్ రామ్ అరవింద్ (తమిళనాడు) తన రాష్ట్రానికే చెందిన పి. దర్శన్‌పై సునాయాస విజయం సాధించాడు. రెండో సీడ్ సౌరభ్ ఆనంద్... దెబంగా కలిట (అస్సాం)పై నెగ్గాడు. ఈ టోర్నమెంట్లో 26 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఓపెన్ కేటగిరీలో 181 మంది, బాలికల విభాగంలో 101 మంది బరిలోకి దిగారు.