తట్టుకోలేనంత సంతోషంలో ప్రీతి జింతా!

Preity Zinta Double Happy With Punjab Win Against Delhi - Sakshi

కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ శుభారంభం

ఢిల్లీడేర్‌ డెవిల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం

మొహాలి : ఐపీఎల్‌-11 సీజన్‌లో కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ శుభారంభం చేయడంతో ఆ జట్టు సహయజమాని ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీడేర్ డెవిల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డుకు తోడు కరుణ్‌ నాయర్‌ మెరవడంతో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రీతి జింతా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. 

‘నూతన సారథి అశ్విన్‌ నాయకత్వంలో కేఎల్‌ రాహుల్‌ రికార్డు నమోదు, ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్‌ యువ క్రికెటర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, కరుణ్ నాయర్‌ ప్యాక్స్‌ పంచ్‌లతో మ్యాచ్‌ ఆసాంతం నా నవ్వును ఆపుకోలేకపోయాను’ టింగ్‌! అని ఈ స్టార్‌ ఆటగాళ్లతో దిగిన ఫొటోను షేర్‌ చేసింది ఈ సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ పంజాబ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాచ్‌తో పంజాబ్‌ ఆటగాళ్లు రెండు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి ఐపీఎల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దీంతో ఇప్పటివరకూ యూసఫ్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌  పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డు బద్ధలైంది. ఇక 17 ఏళ్ల 11 రోజుల వయసుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ పేరిట ఉండేది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top