ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల | Pranjala in the pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

Mar 1 2017 12:44 AM | Updated on Sep 5 2017 4:51 AM

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం

గ్వాలియర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల 6–2, 2–6, 7–5తో భారత్‌కే చెందిన నందిని శర్మపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి నిధి చిలుముల 6–4, 2–6, 4–6తో లులు రాడోవిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు గువహటిలో జరుగుతున్న ఇండియా ఫ్యూచర్స్‌–3 టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ రెండో రౌండ్‌లోకి చేరాడు. తొలి రౌండ్‌లో విష్ణు 6–3, 7–6 (7/3)తో జతిన్‌ దహియాపై గెలిచాడు.  

Advertisement
 
Advertisement
Advertisement