యూపీ యోధాపై తమిళ్‌ తలైవాస్‌ గెలుపు  | PKL 2018: Tamil Thalaivas beat UP Yoddha 46-24 | Sakshi
Sakshi News home page

యూపీ యోధాపై తమిళ్‌ తలైవాస్‌ గెలుపు 

Nov 3 2018 2:29 AM | Updated on Nov 3 2018 2:29 AM

PKL 2018: Tamil Thalaivas beat UP Yoddha 46-24 - Sakshi

గ్రేటర్‌ నోయిడా: రైడింగ్‌లో అజయ్‌ ఠాకూర్, సుఖేశ్‌ హెగ్డే... ట్యాక్లింగ్‌లో మన్‌జీత్‌ చిల్లర్, అమిత్‌ హుడా చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ ఆర్‌ సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ మూడో విజయం నమోదు చేసింది. జోన్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 46–24తో యూపీ యోధాపై విజయం సాధించింది. అజయ్‌ సుఖేశ్‌ చెరో 9 రైడ్‌ పాయింట్లు ... మన్‌జీత్‌ 8, అమిత్‌ 6 ట్యాకిల్‌ పాయింట్లు సాధించారు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తలైవాస్‌ దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 26–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.

రెండో సగంలోనూ అధిపత్యం కొనసాగిస్తూ సునాయాస విజయం సొంతం చేసుకుంది. యూపీ యోధా తరఫున ప్రశాంత్‌ కుమార్‌ రాయ్‌ 7 రైడ్‌ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 36–25తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement