ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరితో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’  | pentala harikrishna faced another draw | Sakshi
Sakshi News home page

ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరితో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ 

Apr 25 2019 12:51 AM | Updated on Apr 25 2019 12:51 AM

pentala harikrishna faced another draw - Sakshi

షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో చైనాలో బుధవారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను ప్రపంచ 29వ ర్యాంకర్‌ హరికృష్ణ 66 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న  ఈ టోర్నీలో ఏడో రౌండ్‌ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 4.5 పాయింట్లతో అనీశ్‌ గిరి రెండో స్థానంలో... 3.5 పాయింట్లతో లిరెన్‌ డింగ్‌ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement