పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు | Pele’s son Edinho sentenced to 33 years in jail over money-laundering for Santos drug cartel | Sakshi
Sakshi News home page

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

Jun 2 2014 1:46 AM | Updated on Sep 2 2017 8:10 AM

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న పీలేకు నిజంగా ఇది చేదువార్తే. ఆయన కుమారుడు ఎడిన్హోకు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సావోపాలో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న పీలేకు నిజంగా ఇది చేదువార్తే. ఆయన కుమారుడు ఎడిన్హోకు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా సమకూరిన డబ్బును అక్రమంగా రవాణా చేస్తున్నందుకు తను ఈ శిక్షను ఎదుర్కోనున్నాడు.
 
  1990ల్లో సాంటోస్ క్లబ్ తరఫున ఎడిన్హో గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే తాను డ్రగ్స్‌కు బానిసనే కానీ ఆ మాఫియాతో కలిసి పనిచేయడం లేదని 43 ఏళ్ల ఎడిన్హో వాదిస్తున్నాడు. మరోవైపు అతడికి డ్రగ్స్ డాన్ రొనాల్డో నాల్డిన్హోతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శిక్షపై ఎడిన్హో పైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నాడు. పీలేకు అతను మూడో సంతానం.
 

Advertisement
 
Advertisement
Advertisement