సైక్లింగ్‌ కోచ్‌గా పాండు జాదవ్‌  | Pandu Jadhav Selects As Cycling Coach Of Telangana Team | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌ కోచ్‌గా పాండు జాదవ్‌ 

Feb 20 2020 10:02 AM | Updated on Feb 20 2020 10:02 AM

Pandu Jadhav Selects As Cycling Coach Of Telangana Team - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్‌ కోచ్‌గా వ్యాయామ విద్య (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) విద్యార్థి పాండు జాదవ్‌ ఎంపికయ్యాడు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పాండు జాదవ్‌ ఓయూ పరిధిలోని వ్యాయామ విద్య కాలేజీలో ఎంపీఈడీ కోర్సు చదువుతున్నాడు.

నేటి నుంచి శనివారం వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ సైక్లింగ్‌ పోటీల్లో రాష్ట్ర సీనియర్, జూనియర్‌ జట్లకు పాండు జాదవ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్‌ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement