తొలి ఓవర్ లో వికెట్ కోల్పోయిన పాక్ | pakistan lose first wicket in asish nehras over | Sakshi
Sakshi News home page

తొలి ఓవర్ లో వికెట్ కోల్పోయిన పాక్

Feb 27 2016 7:09 PM | Updated on Sep 3 2017 6:33 PM

ఆసియాకప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది.

మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మహ్మద్ హఫీజ్(4)ను ఆశిష్ నెహ్రా పెవిలియన్కు పంపాడు. మొదటి ఓవర్లో ఫోర్ కొట్టి ఊపుమీద కనబడ్డ హఫీజ్..  నెహ్రా వేసిన నాల్గో బంతికి చిక్కాడు.

 

నెహ్రా కొద్దిగా బౌన్స్ ను జోడించి ఆఫ్ స్టంప్ పై సంధించిన బంతి హఫీజ్ బ్యాట్ను ముద్దాడుతూ మహేంద్ర సింగ్ ధోని చేతుల్లోకి వెళ్లడంతో పాకిస్తాన్ ఆదిలోనే వికెట్ను నష్టపోయింది. దీంతో పాకిస్తాన్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోయి ఐదు పరుగులు  చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement