భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పునఃప్రారంభం.. | pakistan and india Match started again | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పునఃప్రారంభం..

Jun 4 2017 4:42 PM | Updated on Sep 5 2017 12:49 PM

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పునఃప్రారంభం..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పునఃప్రారంభం..

చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ ల వన్డే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 10వ ఓవర్ లో వర్షం పడింది.

బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ ల వన్డే మ్యాచ్ వర్షం అంతరాయం అనంతరం తిరిగి ప్రారంభమైంది.  భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో 9.5 ఓవర్ వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ పునః ప్రారంభమైంది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు ఇన్నింగ్స్ ను తిరిగి ఆరంభించారు.

 

అయితే కాసేపు మాత్రమే వర్షం అంతరాయం కల్గించడంతో ఓవర్లను కుదించలేదు. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని ముందునుంచి చెబుతున్నసంగతి విదితమే. ఇక వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా జరగాలని ఇరు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement