హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి | P V Sindhu loses in Hong Kong Open Super Series | Sakshi
Sakshi News home page

హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి

Nov 20 2014 5:01 PM | Updated on Sep 2 2018 3:19 PM

హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి - Sakshi

హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి

హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది.

హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూసింది.

జపనీస్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో గంటపైగా సాగిన మ్యాచ్ లో 17-21, 21-13, 11-21తో సింధు పరాజయం పాలైంది. నోజోమీతో సింధు తలపడడం ఇది రెండోసారి. 2012లో ఆసియా యూత్ బ్యాడ్మింటన్ అండర్-19 టోర్నమెంట్ లో తొలిసారిగా వీరిద్దరూ పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement