
మా బ్యాటింగ్ లైనప్‌లో ఇబ్బందేమీ లేదు: పుజారా
ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నా తమ బ్యాటింగ్ లైనప్
ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నా తమ బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి లోపాలు లేవని చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘మా ఆటలో భారీ భాగస్వామ్యాలు నమోదు కావడం లేదు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతున్నాం.
అయితే మా లైనప్‌లో లోపాల్లేవు. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు. మూడో రోజు ఆటలో ఆసీస్‌ను 300లోపు ఆలౌట్ చేస్తాం. రెండో ఇన్నింగ్స్‌లో మా గేమ్ ప్లాన్‌ను మార్చాల్సి ఉంది. కచ్చితంగా మెరుగ్గా ఆడతామన్న నమ్మకం ఉంది’ అని పుజారా అన్నాడు.