ఓక్రిడ్జ్ జట్లకు మిశ్రమ ఫలితాలు | Oakridge teams, mixed results | Sakshi
Sakshi News home page

ఓక్రిడ్జ్ జట్లకు మిశ్రమ ఫలితాలు

Aug 22 2013 12:00 AM | Updated on Sep 1 2017 9:59 PM

అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీల రెండో రోజు ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల తన హవాను చాటుకుంది.

రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీల రెండో రోజు ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల తన హవాను చాటుకుంది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్‌లో బుధవారం నిర్వహించిన బాలికల విభాగం పోటీల్లో డీపీఎస్ 27-05 స్కోరుతో హెచ్‌పీఎస్‌ను, ఓక్రిడ్జ్ న్యూట న్ క్యాంపస్... ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను, మెరిడియన్ 14-0తో ఓక్రిడ్జ్‌ను, సీఆర్‌పీఎఫ్ 25-18తో ఓబుల్‌రెడ్డి స్కూల్‌ను, డీపీస్14-04తో మెరిడియన్ స్కూల్‌ను ఓడించాయి.
 
 అదే విధంగా బాలుర విభాగంలో సీఆర్‌పీఎఫ్ 38-18తో డీఆర్‌ఎస్‌ను, ఓక్రిడ్జ్ న్యూటన్ క్యాంపస్ 45-13తో ఐవీవై లీగ్ స్కూల్‌ను, సెయింట్ అండ్రూస్ 36-19తో డీపీఎస్‌ను, డీఆర్‌ఎస్ 26-23తో మెరిడియన్ స్కూల్‌ను, చిరెక్ 45-04తో నాసర్ స్కూల్‌ను, ఓబుల్‌రెడ్డి స్కూల్ 20-15తో హెచ్‌పీఎస్ రామాంతపూర్ స్కూల్‌ను ఓడించాయి. సెయింట్ అండ్రూస్ క్రీడాకారుడు డేవిడ్ ఒక్కడే 21 బాస్కెట్లు వేయగా ఓక్రిడ్జ్ న్యూటన్ క్యాంపస్‌కు చెందిన అఖిల్ 12, షరన్ 10, మెరిడియన్ స్కూల్ కృష్ణ 12 బాస్కెట్‌లు వేసి తమ ప్రతిభను చాటారు.
 
 మరోవైపు అండర్-10, అండర్-12, అండర్-14, అండర్-17 విభాగాల్లో స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన అండర్-10 బాలుర విభాగం  25 మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో శ్రీనిధి పాఠశాలకు చెందిన కృష్ణసాయి మొదటి స్థానం, ఓక్రిడ్జ్‌కు చెందిన ఇమామ్ హుస్సేన్ రెండవ స్థానం పొందారు.
 
 బాలికల విభాగంలో డీపీఎస్‌కు చెందిన చంద్రిక, ఓక్రిడ్జ్ స్విమ్మర్ ప్రీతిదేవిరెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. అండర్-12 బాలుర విభాగం 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఓక్రిడ్జ్‌కు చెందిన శౌర్య, ఈషాన్ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. బాలికల విభాగంలో డీపీఎస్‌కు చెందిన అఖిల ప్రథమ స్థానంలో నిలువగా, ఓక్రిడ్జ్‌కు చెందిన భారతి, ఆరుషి ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. ఈ పోటీలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement