వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్‌పై జకోవిచ్‌ గెలుపు | Novak Djokovic wins second Wimbledon title | Sakshi
Sakshi News home page

వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్‌పై జకోవిచ్‌ గెలుపు

Jul 6 2014 11:24 PM | Updated on Sep 2 2017 9:54 AM

వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్‌పై జకోవిచ్‌ గెలుపు

వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్‌పై జకోవిచ్‌ గెలుపు

టాప్ సీడ్, సెర్పియన్ టెన్నిస్ క్రీడాకారుడు నువాక్ జోకోవిచ్ రెండవ వింబుల్డన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

లండన్: టాప్ సీడ్, సెర్పియన్ టెన్నిస్ క్రీడాకారుడు నువాక్ జోకోవిచ్ రెండవ వింబుల్డన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగవ సీడ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ను ఓడించడం ద్వారా కెరీర్ లో ఏడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నాడు. 
 
మూడు గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  6-7(7) 6-4 7-6 (4) 5-7 6-4 స్కోర్ తేడాతో ఫెదరర్ పై జకోవిచ్ విజయం సాధించాడు. 2011లో వింబుల్డన్ టైటిల్ ను గెలిచిన జోకోవిచ్ ఖాతాలో ఓ యూఎస్ ఓపెన్ తోపాటు, నాలుగు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement