వన్డే కెప్టెన్సీ వదలను: కుక్ | Not quitting as ODI captain, says Alastair Cook | Sakshi
Sakshi News home page

వన్డే కెప్టెన్సీ వదలను: కుక్

Sep 3 2014 10:52 AM | Updated on Sep 2 2017 12:49 PM

వన్డే కెప్టెన్సీ వదలను: కుక్

వన్డే కెప్టెన్సీ వదలను: కుక్

ఇంగ్లీషు గడ్డపై ధోనిసేన వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ పై ఒత్తిడి పెరుగుతోంది.

బర్మింగ్హామ్: ఇంగ్లీషు గడ్డపై ధోనిసేన వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ పై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడంతో అతడు విపరీత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అయితే తాను వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నాయకత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని వెల్లడించాడు.

బోర్డు తనను కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ తెలిపాడు. మూడున్నరేళ్లుగా కెప్టెన్ గాకొనసాగుతున్నానని, ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ మరో వన్డే మిగిలుండగానే చేజార్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement