బ్లాటర్‌కు నోబెల్ | nobel to Sepp Blatter | Sakshi
Sakshi News home page

బ్లాటర్‌కు నోబెల్

Dec 18 2015 12:17 AM | Updated on Sep 3 2017 2:09 PM

బ్లాటర్‌కు నోబెల్

బ్లాటర్‌కు నోబెల్

ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అత్యంత గౌరవనీయ వ్యక్తి అని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందజేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు.

•  శాంతి బహుమతి ఇవ్వాలి
•  రష్యా అధ్యక్షుడు పుతిన్

 మాస్కో: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ అత్యంత గౌరవనీయ వ్యక్తి అని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందజేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ ఫుట్‌బాల్ అభివృద్ధికి బ్లాటర్ ఎంతగానో కృషి చేశారు. కేవలం దీన్ని క్రీడగానే భావించకుండా వివిధ దేశాల, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఓ అవకాశంగా మలుచుకున్నారు. అందుకే నోబెల్ శాంతి బహుమతి అందుకునే అర్హత బ్లాటర్‌కు ఉంది. ఆయనపై ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి విచారణ వెనుక పాశ్యాత్య దేశాల కుట్ర దాగి ఉంది’ అని పుతిన్ అన్నారు. 2 మిలియన్ డాలర్ల అవకతవకలపై బ్లాటర్‌పై 90 రోజుల సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ విచారణ సాగుతున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement