Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌ నిజాం కాలేజి

Published Sun, Sep 2 2018 10:25 AM

Nizam College win Overall Inter College Judo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి జూడో టోర్నమెంట్‌లో నిజాం కాలేజి జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. జీహెచ్‌ఎంసీ సలార్‌–ఎ–మిలత్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిజాం కాలేజి ప్లేయర్లు 4 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. 60 కేజీల విభాగంలో బి. పున్నం చంద్ర, 66 కేజీల విభాగంలో నిజాముద్దీన్, 81 కేజీల విభాగంలో కె. శివ, 90 కేజీల విభాగంలో ముజాహిద్‌ రోస్‌ఖాన్‌ నిజాం కాలేజి తరఫున పసిడి పతకాలను దక్కించుకున్నారు.

55 కేజీల విభాగంలో సయీద్‌ జుంబాలి (బద్రుకా), ఎం.ఏ హనన్‌ (అన్వర్‌–ఉల్‌–ఉలూమ్‌), ఎస్‌. రామాంజనేయ (సెయింట్‌ మేరీస్‌), కె. ఉదయ్‌ కిరణ్‌ (సీబీఐటీ) వరుసగా తొలి నాలుగు స్థానాలను సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా జూడో సంఘం అధ్యక్షులు శ్యామ్‌ అగర్వాల్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శులు ప్రొఫెసర్‌ బి. సునీల్‌ కుమార్, కె.దీప్లా తదితరులు పాల్గొన్నారు.  

ఇతర వెయిట్‌ కేటగిరీల విజేతల వివరాలు

 60 కేజీలు: 1. బి. పున్నం చంద్ర (నిజాం కాలేజి), 2. అబ్దుర్‌ రషీద్, 3. మొహమ్మద్‌ అర్ఫత్‌ అలీ (అరోరా డిగ్రీ కాలేజి).
 66 కేజీలు: 1. నిజాముద్దీన్‌ (నిజాం కాలేజి), 2. కె. సాయి కుమార్‌ (ఐఐఎంసీ), 3. ఎం. శరణ్‌ బసప్ప (బీజేఆర్‌ కాలేజి).

 73 కేజీలు: 1. సాజిద్‌ అలీ ఖాన్‌ (అన్వర్‌– ఉల్‌–ఉలూమ్‌), 2. షేక్‌ మొయిన్‌ (బీజేఆర్‌ డిగ్రీ కాలేజి), 3. షేక్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా (టీఎంఎస్‌ఎస్‌).
 81 కేజీలు: 1. కె. శివ కుమార్‌ (నిజాం కాలేజి), 2. బి. సాయి తరుణ్‌ (బీజేఆర్‌ కాలేజి), 3. అలీ అమూదీ (టీఎంఎస్‌ఎస్‌).

 90 కేజీలు: 1. ముజాహిద్‌ రోస్‌ఖాన్‌ (నిజాం కాలేజి), 2. సైఫుద్దీన్‌ మొహమ్మద్‌ ఖాజా (ఎంజే ఇంజనీరింగ్‌ కాలేజి), 3. మొహమ్మద్‌ షానవాజ్‌ (అన్వర్‌– ఉల్‌– ఉలూమ్‌).
 100 కేజీలు: 1. కె. కేశవ్‌ కుమార్‌ (బద్రుకా), 2. జునైద్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ (విద్యా దాయని), 3. మొహమ్మద్‌ అమీర్‌ ఖాన్‌ (అన్వర్‌– ఉల్‌–ఉలూమ్‌). 

Advertisement

తప్పక చదవండి

Advertisement