ఆసియా బాక్సింగ్‌  పోటీలకు నిఖత్‌  

Nikhat to Asian boxing tournaments - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్థానం సంపాదించింది. ఏప్రిల్‌ 16 నుంచి 27 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం శనివారం సెలెక్షన్‌  ట్రయల్స్‌ నిర్వహించారు. 51 కేజీల విభాగంలో నిఖత్‌ జరీన్‌  4–1తో పింకీ రాణి (హరియాణా)పై నెగ్గి జాతీయ జట్టులోకి ఎంపికైంది. మరోవైపు దిగ్గజం మేరీకోమ్‌ ఆసియా చాంపియ¯Œ షిప్‌ పోటీలకు దూరమైంది. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్‌ షిప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. 

భారత జట్టు: నీతూ (హరియాణా–48 కేజీలు), నిఖత్‌ జరీన్‌  (తెలంగాణ–51 కేజీలు), మనీషా   (హరియాణా–54 కేజీలు), సోనియా చహల్‌ (రైల్వేస్‌–57 కేజీలు), సరితా దేవి (ఆలిండియా పోలీస్‌–60 కేజీలు), సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ (పంజాబ్‌–64 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (అస్సాం–69 కేజీలు), నుపుర్‌ (హరియాణా–75 కేజీలు), పూజా రాణి (హరియాణా–81 కేజీలు), సీమా పూనియా (రైల్వేస్‌–ప్లస్‌ 81 కేజీలు).  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top