ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన సౌతీ | New Zealand bundle out England for 123 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన సౌతీ

Feb 20 2015 9:12 AM | Updated on Sep 2 2017 9:38 PM

ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన సౌతీ

ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన సౌతీ

కివీస్ బౌలర్ టిమ్ సౌతీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది.

వెల్లింగ్టన్: కివీస్ బౌలర్ టిమ్ సౌతీ చెలరేగడంతో ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. సౌతీకి ఇంగ్లీషు బ్యాట్స్ మెన్ దాసోహయ్యారు. సౌతీ 7 వికెట్లు కూలగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. కివీస్ కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్(46) ఒక్కడే రాణించాడు. మొత్తం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఇద్దరు డకౌటయ్యారు. ఆరంభం నుంచే ఇంగ్లీషు బ్యాట్స మెన్ పై సౌతీ దాడి కొనసాగింది. 36 పరుగులకే ఓపెనర్లను క్లీన్ బౌల్డ్ చేసిన సౌతీ తర్వాత కూడా నిప్పులు చెరిగాడు. మొత్తం నాలుగు క్లీన్ బౌల్డ్ లు చేశాడు. 9 ఓవర్లలో 33 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement