ఔరా... మేరీ! 

 Never weighed down: In pursuit of gold, Mary Kom lost 2kg in 4 hours - Sakshi

 4 గంటల్లోనే 2 కేజీలు తగ్గింది 

48 కేజీల కేటగిరీ కోసం వీరోచిత కసరత్తు   

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్‌ బాక్సర్‌ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్‌ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది.
 

 ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్‌ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్‌ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్‌ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్‌ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది.  

    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top