నరైన్ సంచలన బౌలింగ్ | Narine sensational bowler | Sakshi
Sakshi News home page

నరైన్ సంచలన బౌలింగ్

Jun 5 2016 12:25 AM | Updated on Sep 4 2017 1:40 AM

నరైన్ సంచలన బౌలింగ్

నరైన్ సంచలన బౌలింగ్

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది.

దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్లతో విండీస్ విజయం 
ముక్కోణపు వన్డే సిరీస్

 
ప్రావిడెన్స్ (గయానా): దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. స్పిన్నర్ సునీల్ నరైన్ (6/27) కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో చెలరేగడంతో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో విండీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గత 15 ఏళ్లలో తమ సొంతగడ్డపై విండీస్ జట్టు సఫారీలపై నెగ్గడం ఇదే తొలిసారి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 46.5 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వివాదాస్పద బౌలింగ్‌తో జాతీయ జట్టుకు దూరమైన నరైన్ ఏడు నెలల అనంతరం ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.

ఒక దశలో 160 పరుగులకు నాలుగు వికెట్లతో పటిష్టంగా ఉన్న సఫారీలు మరో 22 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. రోసో (83 బంతుల్లో 61; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. డివిలియర్స్ (49 బంతుల్లో 31)తో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. బ్రాత్‌వైట్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 48.1 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలిచింది. 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కీరన్ పొలార్డ్ (67 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు; 6 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. చార్లెస్ (52 బంతుల్లో 31; 4 ఫోర్లు), డారెన్ బ్రేవో (69 బంతుల్లో 30; 2 ఫోర్లు) రాణించారు. ఫంగిసోకు మూడు, తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. నేడు (ఆదివారం) ఆస్ట్రేలియాతో విండీస్ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement