పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నజమ్ సేథీని తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక్క రోజు కూడా గడవకముందే సుప్రీం కోర్టు మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించింది.
ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు
కరాచీ: పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నజమ్ సేథీని తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక్క రోజు కూడా గడవకముందే సుప్రీం కోర్టు మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించింది.
30 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా కేర్ టేకర్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జ్ అలీ షాను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కోర్టు పక్కనబెట్టింది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది. తాజా ఎన్నికల కోసమే అలీని నియమించామన్న అటార్నీ జనరల్ వాదనను పట్టించుకోలేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నం సరికాదని, విషయం తేలే వరకు సేథీని పదవిలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది.