నాదల్ x ముర్రే | Murray roars into semi-final against Nadal | Sakshi
Sakshi News home page

నాదల్ x ముర్రే

Jun 6 2014 12:50 AM | Updated on Sep 2 2017 8:21 AM

నాదల్  x ముర్రే

నాదల్ x ముర్రే

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) సెమీఫైనల్లో తలపడనున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) సెమీఫైనల్లో తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో నాదల్ 4-6, 6-4, 6-0, 6-1తో ఐదోసీడ్ డేవిడ్ ఫై (స్పెయిన్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-1, 4-6, 1-6, 6-0తో 23వ సీడ్ గేల్ మోన్‌ఫీల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
 
 నాదల్‌తో గంటా 34 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఫై గట్టిపోటీయే ఇచ్చాడు. అయితే 14 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకోవడం ఫైను దెబ్బతీసింది. 50 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు నాదల్ 14 బ్రేక్ పాయింట్లకు తొమ్మిదింటిని వినియోగించుకున్నాడు.
 
 నేటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
 జొకోవిచ్ (2)   x గుల్బిస్ (18)
 ముఖాముఖి రికార్డు: 4-1
 నాదల్ (1)   x ముర్రే (7)
 ముఖాముఖి రికార్డు: 15-4
 సాయంత్రం 6.30 నుంచి
 నియోప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement