కోల్కతా పై ముంబై గెలుపు | mumbai beats kolkatha by 5 runs | Sakshi
Sakshi News home page

కోల్కతా పై ముంబై గెలుపు

May 14 2015 11:59 PM | Updated on Sep 3 2017 2:02 AM

కోల్కతా పై ముంబై గెలుపు

కోల్కతా పై ముంబై గెలుపు

ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 5పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో కోల్కతా చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి ఉండగా పోలార్డు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టుకి విజయాన్ని అందించాడు.

ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 5పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో కోల్కతా చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి ఉండగా పోలార్డు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టుకి విజయాన్ని అందించాడు.
 
 టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.  జట్టు 29 పరుగుల వద్ద ఓపెనర్గా పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(30) నరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వత క్రీజ్లోకొచ్చిన పోలార్డ్,పాండ్యాలు మొదట్లో నిదానంగా ఆడి చివర్లో మెరుపులు మెరిపించారు. యాదవ్ వేసిన 17 వ ఓవర్లో పాండ్యా వరుసగా నాలుగు బౌండరీలు బాది ఏకంగా 18 పరుగులు, రస్సెల్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాది 17 పరుగుల రాబట్టాడు..దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171  పరుగులు చేసింది.

172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా తొలి నుంచి దాటిగా ఆడింది. ఓపెనర్లుగా వచ్చిన గంబీర్, ఉతప్పలు తొలి వికెట్ కి 45 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఉతప్ప(25)పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవ్వగా, ఆతర్వత వచ్చిన మనీష్ పాండే(1) వెంటనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 88 పరుగుల వద్ద  గౌతం గంభీర్(38) మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.. షకీబ్ స్కోర్ పెంచే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆ తర్వత వచ్చిన రస్సెల్(2) వెంటనే వెనుదిరిగాడు. దూకుడుగా ఆడుతూ కనిపించిన సూర్యకుమార్ యాదవ్(11) సిక్సర్ కి ప్రయత్నించి ఆరో వికెట్ గా ఔట్ అయ్యాడు.  యూసుఫ్ పటాన్(52) బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడినా కీలకమైన చివరి ఓవర్లో అవుటయ్యాడు. చివరి ఓవర్లో పరుగులు రాబట్టడంలో చావ్లా విఫలం అవ్వడంతో కోల్కతా ఓటమి చెందింది.

ఈ మ్యాచ్ గెలుపుతో ముంబై ప్లేఆప్ పై ఆశలు సజీవంగానే ఉంచుకున్నట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement