ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి: ధోని

MS Dhoni relives the old days at a waterfall near Ranchi - Sakshi

రాంచీ: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కాస్త విరామం దొరికిన కుటుంబ సభ్యులతో గడుపుతాడు. ప్రస్తుతం కోహ్లిసేన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతుండటంతో భారత్‌కు తిరిగి వచ్చిన ధోని తన కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు తిరుగుతున్నాడు. ప్రస్తుతం రాంచీలో ఉన్న జార్ఖండ్‌ డైనమైట్‌.. రాంచీ సమీపంలోని జలపాతాలున్న ప్రాంతాలకు వెళ్లినట్లు తెలపాడు.

దీనికి సబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి క్యాప్షన్‌గా ‘ రాంచీ సమీపంలో మూడు వాటర్‌ ఫాల్స్‌ ఉన్నాయి. ఎప్పుడైన ఇక్కడికి రావచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇక్కడ ఇలా జలకాలు ఆడుతున్నాం. నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇక్కడ హెడ్‌ మసాజ్‌ ఫ్రీ’ అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ధోని బహుబలిలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ అనంతరం భారత్‌ ఆసియాకప్‌లో పాల్గొననుంది. అప్పుడు కోహ్లి జట్టుతో కలవనున్నాడు. ప్రస్తుత సమయాన్ని వాణిజ్య ప్రకటనలు, కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో ధోని ప్రదర్శన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. 

చదవండి: ఆ నిర్ణయమే కోహ్లిసేన కొంపముంచిందా?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top