'బేబీ! నేను ఎప్పటికి నీదాన్నే' | MS Dhoni Hilariously Trolls Wife Sakshi About Instagram Followers | Sakshi
Sakshi News home page

'బేబీ! నేను ఎప్పటికి నీదాన్నే'

Feb 1 2020 9:20 AM | Updated on Feb 1 2020 10:18 AM

MS Dhoni Hilariously Trolls Wife Sakshi About Instagram Followers

రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్నా సోషల్‌ మీడియా ద్వారా  తన అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్‌లోనే ఉంటాడు. తను పెట్టే పోస్టులతో పాటు తన భార్య సాక్షి సింగ్‌ పెట్టే పోస్టుల్లోనూ తరచుగా కనిపిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ధోని కంటే సాక్షినే సోషల్‌ మీడియాలో మరింత చురుకుగా ఉంటారన్న సంగతి చెప్పనవసరం లేదు. తన భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తన అభిమానులతో పాటు ధోని అభిమానుల మనసును గెలుచుకుంటారు. తాజాగా ధోని అభిమానులు తమ ట్విటర్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు. ఆ వీడియోలో ధోని తన భార్య సాక్షినుద్ధేశించి' నీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్‌ జాబితాలో నన్ను కూడా చేర్చావుగా' అంటూ ట్రోల్‌ చేశాడు. దీంతో రూంలో ఉన్న మిగతావారు గొల్లున నవ్వేసరికి సాక్షి ధోని దగ్గరకు వచ్చి ' బేబీ !  నాకు ఫాలోవర్స్‌ ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికి నీ దాన్నే' అని పేర్కొన్నారు.(‘ధోని సీటును అలానే ఉంచాం’)

కాగా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గతేడాది జూన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌ ఆడని ధోనికి బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్‌లో చోటు లభించలేదు. దీంతో అతని కెరీర్‌పై అభిమానుల్లో సందిగ్థత నెలకొన్న ఇప్పటి వరకు ధోని తన రిటైర్మంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement