ఐపీఎల్‌ టైమింగ్స్‌పై ధోని దంపతుల నిరసన  | MS Dhoni and Sakshi Napping On Airport Floor  | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ టైమింగ్స్‌పై ధోని దంపతుల నిరసన 

Apr 10 2019 2:27 PM | Updated on Apr 10 2019 2:30 PM

MS Dhoni and Sakshi Napping On Airport Floor 

నేలపై పడుకున్న Mr & Mrs ధోని

తమ బ్యాగ్స్‌ను తలదిండులుగా చేసుకొని నేలపై పడుకున్నారు..

చెన్నై : ఐపీఎల్‌ షెడ్యూల్‌ టైమింగ్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, అతని సతీమణి నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌తో జైపూర్‌ వేదికగా ఆడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఉదయం అక్కడికి బయలు దేరింది. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ధోని దంపతులు నేలపై పడుకున్నారు. తమ బ్యాగ్స్‌ను తలదిండులుగా చేసుకొని సేద తీరారు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని తప ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ... ‘ఐపీఎల్‌ టైమింగ్స్‌ వల్ల.. మార్నింగ్‌ ఫ్లైట్‌ ఉంటే ఇలాంటివి జరుగుతాయి.’అని  క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అర్థరాత్రి వరకు మ్యాచ్‌.. మళ్లీ మార్నింగే ఫ్లైట్‌ అంటే ఎవరికైనా కష్టమే అంటూ అభిమానులు ధోనికి మద్దతుగా కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.


ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నేలపై పడుకున్న ధోని

ఇక ధోని ఎయిర్‌పోర్ట్‌లో ఇలా నేలపై పడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ సందర్భంగా ఇదే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ధోని నేలపై పడుకొని సేదతీరాడు. అప్పుడు ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేసింది. ధోని అంటేనే సింప్లిసిటీ..సింప్లిసిటీ అంటేనే ధోని అని అభిమానులు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement