వైరల్‌ : బౌలర్‌గా అవతారమెత్తిన తల్లి | Mother Blowing Child Batting Mohammad Kaif Tweet | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం తల్లి బౌలర్‌ అవతారం

Jan 14 2020 8:35 AM | Updated on Jan 14 2020 8:41 AM

Mother Blowing Child Batting Mohammad Kaif Tweet - Sakshi

భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్‌ మామూలుగా ఉండదు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు జెంటిల్‌మాన్‌ క్రీడకు పడిచచ్చి పోతారు. మ్యాచ్‌ ఉందంటే చాలు.. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా స్టేడియంలో వాలిపోతారు.  ఇటీవల ఓ దివ్యాంగ బాలుడు రెండు కాళ్లు చచ్చుబడిపోయినా.. తోటి పిల్లలతో కలిసి పోటాపోటీగా క్రికెట్‌ ఆడుతూ అందర్నీ ఆకర్షించాడు. తాజాగా ఓ తల్లి తన రెండేళ్ల కొడుకు కోసం బౌలర్ అవతారమెత్తి.. వీధుల్లో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రద్దీగా ఉన్న రోడ్డులో తన కుమారుడికి బౌలింగ్‌ చేస్తూ.. కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘కొడుకు బ్యాటింగ్‌.. అమ్మ బౌలింగ్‌..  మొత్తానికి బ్యాటిఫుల్‌’ అని క్యాప్షెన్‌ పెట్టాడు. కాసేపట్లోనే అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement