ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌ | Morris, Matthews out of Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

May 8 2017 10:51 PM | Updated on Sep 5 2017 10:42 AM

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్‌ ఔట్‌

వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్‌ మోరిస్‌

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్‌ మోరిస్‌ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్‌ (శ్రీలంక) ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నుంచి సోమవారం వైదొలిగారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో నిలిచిన ఢిల్లీకి ఇది ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం పట్టికలో 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యా చ్‌ల్లో నెగ్గడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉండాలి. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌ను బుధవారం.. గుజరాత్‌ లయన్స్‌తో కాన్పూర్‌లో ఢిల్లీ ఆడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement