మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు టైటిల్ | Mohammedan Sporting Club title | Sakshi
Sakshi News home page

మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు టైటిల్

Aug 5 2013 12:23 AM | Updated on Sep 1 2017 9:38 PM

ఆర్.డి.ఆభరణం స్మారక హాకీ టోర్నమెంట్‌ను మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 స్కోరుతో రసూల్‌పురాపై ఘన విజయం సాధించింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆర్.డి.ఆభరణం స్మారక హాకీ టోర్నమెంట్‌ను మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 స్కోరుతో రసూల్‌పురాపై ఘన విజయం సాధించింది. మహ్మదన్ స్పోర్టింగ్ జట్టు సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
 
 రసూల్‌పూరా ఆటగాళ్ల నుంచి అంతగా ప్రతిఘటన లేకపోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టులో అబ్దుల్ ఆలీమ్, బి.హీరో, ఇన్నోసెంట్ కులూ, షకీల్, ఆశిష్ తలా ఒక్కో గోల్ చేశారు. ముగింపు వేడుకలకు హాకీ హైదరాబాద్(హెచ్‌హెచ్) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన హెచ్‌హెచ్ కొత్త లోగోను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement