షమీ.. యువర్‌ ఇంగ్లీష్‌ బహుత్‌ అచ్చా!

Mohammed Shami Your English Bahut Acha - Sakshi

మౌంట్‌మాంగనీ : న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్‌.. రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో కోహ్లిసేన వశమైంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహ్మద్‌ షమీ(3/41)కి మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌ వరించింది. అయితే షమీ ఈ అవార్డు అందుకునే సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ హిందీలో మాట్లాడే షమీ.. ఈ సారి ఇంగ్లీష్‌లో మాట్లాడి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన షమీ.. ఆ సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాయం తీసుకున్నాడు. షమీ హిందీలో మాట్లాడగా.. కోహ్లి ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. నిన్న కూడా షమీ వెంట కోహ్లి వచ్చినప్పటికి.. అతనికి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లీష్‌లో అదరగొట్టాడు. షమీ ఇంగ్లీష్‌కు ముగ్ధుడైన కామెంటేటర్‌, న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సిమన్‌ డౌల్‌ ‘షమీ యువర్‌ ఇంగ్లీష్‌ బహుత్‌ అచ్చా.. అభినందనలు’ అని హిందీలో కితాబిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇంతకీ సంభాషణ ఏంటంటే.. న్యూజిలాండ్‌లో ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం ఎలా ఉందని షమీని సిమన్‌ ప్రశ్నించారు. దీనికి షమీ ధైర్యం చేసి ఇంగ్లీష్‌లో ‘నిజానికి ఎదురుగాలుల్లో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. కానీ సాధ్యమయ్యేదే. మరో ఎండ్‌ నుంచి భువనేశ్వర్‌ సాయం అందించాడు. సరైన ప్రదేశాల్లో బంతులను సంధించడమే ముఖ్యం’ అని షమీ చెప్పుకొచ్చాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top