మహ్మద్‌ షమీ చెత్త రికార్డు

Mohammed Shami Worst Record Against West Indies - Sakshi

గువాహటి : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేల్లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన షమీ 81 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ చెత్తరికార్డు రవీంద్ర జడేజాపై ఉండగా.. తాజాగా షమీ అధిగమించాడు. 2014లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో జడేజా 80 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ జాబితాలో జడేజా తరువాత అమర్‌ నాథ్(79)‌, శ్రీశాంత్‌(79), రవిశాస్త్రి (77)లున్నారు. అమర్‌ నాథ్‌, రవిశాస్త్రిలు 1983లో జంషెడ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును మూటగట్టుకోగా..శ్రీశాంత్‌ 2007లో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ వరెస్ట్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక నేటి మ్యాచ్‌ షమీ దారుణంగా పరుగులివ్వడంతో పాటు హెట్‌మెయిర్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌కు విండీస్‌ 323 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించింది. కాగా భారత్‌పై విండీస్‌కు ఇది నాలుగో భారీ స్కోర్‌ కావడం విశేషం. 1983 జంషెడ్‌పూర్‌ వన్డేలో 333/8 భారీ స్కోర్‌ నమోదు చేసిన విండీస్‌.. 2002 అహ్మదాబాద్‌ వన్డేలో 324/4, 2007 నాగ్‌పూర్‌ వన్డేలో 324/8 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top