‘టీమిండియాకు అతనొక విలువైన ఆస్తి’

Mohammed Shami is going to be the biggest asset for India, Nehra - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీపై మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత భారత జట్టులో షమీ ఒక విలువైన ఆటగాడని నెహ్రా కొనియాడాడు. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో షమీ కీలక పాత్ర పోషించనున్నాడన్నాడు. ‘ప్రపంచకప్‌ జట్టులో టీమిండియాకు మహమ్మద్‌ షమీ అత్యంత కీలకంగా మారనున్నాడు. భారత జట్టుకు దొరికిన ఆస్తి షమీ. ఈ మధ్య కాలంలో తన ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు తన ఆటతీరులో షమీ మార్పులు చేసుకుంటున్నాడు. బౌలింగ్‌లో మెరుగవుతూనే ఉన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అతడిని గమనిస్తున్నాను. అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరొకవైపు అతని ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ కూడా బాగున్నాయి. కాబట్టి వరల్డ్‌కప్‌లో షమీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ మెగా టోర్నీలో భారత్‌కు షమీ విలువైన ఆస్తి’ అని నెహ్రా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top