‘దులీప్‌’ జట్లలో మిలింద్, సిరాజ్‌ | Milind, Siraj in 'Duleep' teams | Sakshi
Sakshi News home page

‘దులీప్‌’ జట్లలో మిలింద్, సిరాజ్‌

Aug 31 2017 1:13 AM | Updated on Sep 12 2017 1:23 AM

దులీప్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్లలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు చోటు దక్కింది.

సెప్టెంబర్‌ 7 నుంచి 29 వరకు టోర్నీ

న్యూఢిల్లీ: దులీప్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్లలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు చోటు దక్కింది. ఆంధ్ర ఆటగాడు కె. శ్రీకర్‌ భరత్‌... సురేశ్‌ రైనా సారథ్యంలోని భారత బ్లూ జట్టుకు ఎంపికయ్యాడు. గత సీజన్‌లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన భార్గవ్‌ భట్‌ కూడా ఇదే జట్టులో ఉన్నాడు. హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ సీవీ మిలింద్, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి తిరుపతి రాయుడు, రాహుల్‌ సింగ్‌ భారత రెడ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు భారత గ్రీన్‌ జట్టులో చోటు దక్కింది.

గాయంతో లంక టూర్‌కు దూరమైన భారత ఓపెనర్‌ మురళీ విజయ్‌ కూడా ఈ జట్టులోనే ఉన్నాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లు వచ్చే నెల 7 నుంచి 29 వరకు కాన్పూర్, లక్నో వేదికల్లో జరుగుతాయి. మొదట్లో ఈ టోర్నీకి బీసీసీఐ వార్షిక షెడ్యూల్లో చోటు లేకపోయింది. గంగూలీ జోక్యంతో హడావుడిగా దీన్ని షెడ్యూలులో చేర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement