ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ఏకిపారేసిన మాజీ కెప్టెన్‌

Michael Vaughan Slams ICC Rankings - Sakshi

ఏ విషయంపై అయినా ఎలాంటి జంకు లేకుండా తన అభిప్రాయాలను నిక్కశ్చిగా వెల్లబుచ్చడంలో ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ముందు వరుసలో ఉంటాడు. దీంతో ఒక్కోసారి హీరో అయితే మరి కొన్ని సందర్బాల్లో జీరో లేక విలన్‌గా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు ఆటగాళ్లు, వారి ప్రదర్శన, మైదానాలు, క్రికెట్‌ నిబంధనలపై మాత్రమే విమర్శించే వాన్‌ తాజాగా ఐసీసీపై మండిపడ్డాడు. అదికూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లీష్‌ మాజీ సారథి చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే వాన్‌ వ్యాఖ్యల్లో ద్వంద్వ అర్థాలు ప్రతిబింబిస్తున్నాయిన టీమిండియా ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

ఇంతకి అతడే ఏమన్నాడంటే..
‘గత రెండేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్‌ అసాధారణంగా రాణిస్తూ వరుస సిరీస్‌ విజయాలను నమోదచేస్తోంది. కానీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. అధేవిధంగా ఇంగ్లండ్‌ గత కొంత కాలంగా టెస్టుల్లో తడబడుతోంది. యాషెస్‌ సిరీస్‌లో మినహా ఏ టెస్టు సిరీస్‌లోనూ గొప్ప ప్రదర్శన చేయలేదు. అయినా ఇంగ్లండ్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం (ప్రస్తుతం నాలుగు)లో ఉంది. ఇక ఆస్ట్రేలియా భారత్‌తో జరిగిని సిరీస్‌ మినహా అన్ని టెస్టు సిరీస్‌ల్లోనూ చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది. అయినా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ తర్వాతే ఆసీస్‌ ఉంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నిజాయితీ లోపించిందనే భావన నాకు ఉంది. అంతేకాకుండా నా దృష్టిల్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌ అత్త చెత్త మరొకటి లేదు. 

అయితే టీమిండియా ఆగ్రస్థానంలో ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే గంత కొంతకాలంగా టెస్టుల్లో అసలు సిసలు మజాను అందిస్తుంది టీమిండియానే. నా దృష్టిల్లో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ప్రస్తుతం టెస్టుల్లో మేటి జట్లుగా ఉన్నాయి. వార్నర్‌,స్మిత్‌, లబుషేన్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ దుర్బేద్యంగా మారింది. ఇక బౌలింగ్‌లో ప్రతీసిరీస్‌లోనూ పూర్థిస్థాయి ప్రదర్శన కనబరుస్తుంది. ఇక టీమిండియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస విజయాలతో జోరు మీదుంది. ప్రస్తుతం నా ఆసక్తి అంతా ఆసీస్‌-టీమిండియాల మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌పైనే ఉంది. ఎందుకంటే గతంలో వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌లు లేని ఆసీస్‌పై భారత్‌ గెలిచింది. ఇప్పుడు వారి రాకతో ఆ జట్టు మరింత బలంగా మారింది. దీంతో ఆ సిరీస్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో అనేది వేచి చూడాలి’అని వాన్‌ పేర్కొన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top