'అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా' | Message to me was clear, I had to go after spinners, Krunal Pandya | Sakshi
Sakshi News home page

'అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా'

May 16 2016 9:21 PM | Updated on Sep 4 2017 12:14 AM

'అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా'

'అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. కృనాల్ 37 బంతులెదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిపోయాడు.తాను  బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావడానికి ఢిల్లీ డేర్ డెవిల్స్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే కారణమని కృనాల్ తెలిపాడు.

'ఢిల్లీ ముగ్గురు స్పిన్నర్లతో మాపై పోరుకు సిద్ధమైంది. దాంతో  నా బ్యాటింగ్ ఆర్డర్ను ఫస్ట్ డౌన్కు మార్చారు. స్పిన్నర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేయడం గేమ్ ప్లాన్లో భాగమే. అది మంచి ఫలితాన్నిచ్చింది' అని కృనాల్ తెలిపాడు. ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ చేయడానికి సహచర ఆటగాడు మార్టిన్ గప్తిల్ నుంచి చక్కటి సహకారం అందిందన్నాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు మార్టిన్ తనకు అనేక సూచనలు చేయడం వల్లే దాటిగా బ్యాటింగ్ చేశానని కృనాల్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement