యువ లెగ్‌ స్పిన్నర్‌కు భలే ఛాన్స్‌..!

Mayank Markande Selected For Australia Vs India T20 Series - Sakshi

ఆసీస్‌తో టీ20 సిరీస్ కు పంజాబ్ కుర్రాడు

యువ లెగ్‌ స్పిన్నర్‌కు అవకాశం కల్పించిన సెలెక్టర్లు

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఓ కొత్త కుర్రాడు చేరాడు. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకి ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ శుక్రవారం ఇండియన్‌ టీమ్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల యువ లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. జూనియర్ స్థాయి నుంచే మార్కండే బౌలింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. (ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..)

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఅడుగుపెట్టిన ఏడాదే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 31 పరుగులకు 5 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మే చివరి వారంలో వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవనున్న నేపథ్యంలో కొత్తవాళ్లను తీసుకోకపోవచ్చని క్రికెట్ పండితులు భావించారు. కానీ మార్కండే వంటి టాలెంటెడ్‌ కుర్రాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ తాజా నిర్ణయంద్వారా తెలియపరిచింది. టీమిండియాలో స్థానం సంపాదించడం పట్ల మార్కండే హర్షం వ్యక్తం చేశాడు. తన కల నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇంత త్వరగా టీమిండియాలో స్థానం లభిస్తుందని అనుకోలేదని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top