భారత్‌ ‘ఎ’ను గెలిపించిన మయాంక్‌ 

Mayank Agarwal, Deepak Chahar power India A to 7-wicket win  - Sakshi

లెస్టర్‌: ముక్కోణపు వన్డే టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘ఎ’ చేతిలో పరాజయం పాలైన భారత ‘ఎ’ జట్టు వెంటనే కోలుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ‘ఎ’ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 49.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. డీసీ థామస్‌ (64 నాటౌట్‌) అర్ధ సెంచరీ చేయగా, హేమ్‌రాజ్‌ (45) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో దీపక్‌ చహర్‌ (5/27) ఐదు వికెట్లతో చెలరేగాడు.

అనంతరం భారత్‌ 38.1 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు సాధించింది. మయాంక్‌ అగర్వాల్‌ (102 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో సత్తా చాటగా, శుబ్‌మన్‌ గిల్‌ (92 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌ లో నేడు ఇంగ్లండ్‌తో రెండో సారి తలపడుతుంది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top