పెళ్లి అంటే వర్క్షాప్‌ : సెహ్వాగ్ | Marriage is a workshop twitts Virender Sehwag | Sakshi
Sakshi News home page

పెళ్లి అంటే వర్క్షాప్‌ : సెహ్వాగ్

Feb 18 2017 4:05 PM | Updated on Sep 5 2017 4:02 AM

పెళ్లి అంటే వర్క్షాప్‌ : సెహ్వాగ్

పెళ్లి అంటే వర్క్షాప్‌ : సెహ్వాగ్

మైదానంలో తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియా ద్వారా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు.

న్యూ ఢిల్లీ :
మైదానంలో తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియా ద్వారా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. వివాహం వర్క్షాప్‌లాంటిది అంటూ కితాబిచ్చాడు.. ఈ బంధంలో భర్త వర్క్ చేస్తే, భార్య షాపింగ్‌ చేస్తారు. కానీ, తన భార్య ఆర్తీ అహల్వత్‌ వర్క్ చేస్తూ షాపింగ్ చేస్తుంది అంటూ ట్విట్టర్లో వీరూ పోస్ట్ చేశాడు. బీవీజీ(తన భార్యామణి) రాక్స్ అంటూ డాషింగ్ ఓపెనర్ చమత్కరించాడు.

ఇంతకు ముందు కూడా టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా.. భార్య మూడ్ ఎలా మారిపోతుందో తెలుసుకోవడం భర్తకు ఎంత కష్టమో.. అచ్చంగా అలాగే భువీ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లను గొప్ప బ్యాట్స్‌మన్ గ్రహించడం అసాధ్యమని సెహ్వాగ్‌ తనదైన శైలిలో ట్వీట్ పేల్చిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement