
షరపోవాపై నిషేధం తగ్గింది
డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు కాస్త ఊరట లభించింది.
లాసానే: డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం తనపై రెండేళ్ల నిషేధం ఉండగా క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) 15 నెలలకు తగ్గించింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 26న తిరిగి షరపోవా బరిలోకి దిగనుంది. సీఏఎస్ నిర్ణయంపై రష్యా టెన్నిస్ సమాఖ్య (ఆర్‌టీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. తనపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విధించిన నిషేధంపై షరపోవా జూన్ 9న సీఏఎస్‌లో అప్పీల్ చేసుకుంది. శక్తి సామర్థ్యాలను పెంచే వాడా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియమ్ ఆనవాళ్లు తన శాంపిల్‌లో ఉండడంతో ఈ రష్యా స్టార్‌పై వేటు పడింది.