రన్నరప్‌ మలిష్క జోడీ | Malishka Pair as Runner Up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ మలిష్క జోడీ

Jul 28 2018 10:27 AM | Updated on Jul 28 2018 10:28 AM

Malishka Pair as Runner Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–14 సూపర్‌ సిరీస్‌ టోర్న మెంట్‌లో హైదరాబాద్‌ జోడీ మలిష్క– ఆర్నిరెడ్డి డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గువాహటిలో జరిగిన ఈ టోర్నీ బాలికల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ పరీ సింగ్‌ (మహారాష్ట్ర)– శ్వేత సమంత (పశ్చిమ బెంగాల్‌) జంట చేతిలో మలిష్క ద్వయం ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో మలిష్క– ఆర్నిరెడ్డి 5–3, 5–4 (7)తో జెన్నిక (మహారాష్ట్ర)– అదితి(కర్ణాటక) జంటపై, క్వార్టర్స్‌లో 4–0, 4–0తో చాందిని (తెలంగాణ)– పరి చవాన్‌ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement