దేశంలో ఆయా విభాగాల్లో జరిగే క్రీడా ఈవెంట్ల వివరాలను అందివ్వనందుకు క్రీడా మంత్రిత్వ శాఖను కేంద్ర సమాచార కమిషన్
న్యూఢిల్లీ: దేశంలో ఆయా విభాగాల్లో జరిగే క్రీడా ఈవెంట్ల వివరాలను అందివ్వనందుకు క్రీడా మంత్రిత్వ శాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తప్పుపట్టింది.‘వార్షిక క్రీడా షెడ్యూల్ వివరాలను కూడా అభిమానులు సమాచార హక్కు ద్వారా తెలుసుకోవాలా? ఒకవేళ ఆ వివరాలు మీకు కూడా తెలియకపోతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు.
క్రీడా శాఖతో పాటు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కూడా తమ వెబ్‌సైట్లలో ఈ వివరాలను అప్‌డేట్ చేయండి’ అని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు.