ఆటోగ్రాఫ్‌ అడిగితే ధోని ఏంచేశాడో తెలుసా? | A lucky Fan Manages To Get MS Dhoni's Autograph | Sakshi
Sakshi News home page

ఆటోగ్రాఫ్‌ అడిగితే ధోని ఏంచేశాడో తెలుసా?

Nov 2 2019 12:56 PM | Updated on Nov 2 2019 1:14 PM

A lucky Fan Manages To Get MS Dhoni's Autograph - Sakshi

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో ధోనికి విశేషమైన అభిమాన గణం ఉంది. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత తన వ్యక్తిగత వ్యవహారాలను చూసుకుంటూ కుటుంబంతోనే ఉంటున్నాడు. అయినప్పటికీ అతని  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం అలానే ఉంది. మళ్లీ ధోని క్రికెట్‌లో ఎప్పుడు అడుగు పెడతాడా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఒక అభిమానికి ధోనిని ఆకస్మికంగా కలిసే అవకాశం దొరికింది.

దాన్ని అతడు వదులుకోలేదు. ధోనితో మాట్లాడమే కాకుండా ఆటోగ్రాఫ్‌ను కూడా తీసుకున్నాడు. అయితే ఆటోగ్రాఫ్‌ అడిగిన సదరు అభిమానికి వింత అనుభవం ఎదురైంది. ఆటగాళ్లను ఎవరైనా ఆటోగ్రాఫ్‌ అడిగితే ఏం చేస్తారు.. టీ షర్టులపై కానీ జెర్సీలపై సంతకాలు చేసి ఇస్తారు. మరి ధోని ఆశ్చర్యపరుస్తూ సదరు అభిమాని ఎన్‌ఫీల్డ్‌పైనే సంతకం చేశాడు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు ఎప్పటికీ గుర్తిండి పోయే ఆటోగ్రాఫ్‌ ఇవ్వడంతో అభిమాని ఖుషీ అయిపోయాడు.

ఇటీవల ధోని నిస్సాన్‌ జోంగా కారును కొన్న తెలిసిన సంగతి తెలిసిందే. కాగా, ధోనికి బైక్‌లు అంటే విపరీతమైన ఇష్టం. సుమారు 74 బైక్‌లు వరకూ ధోని వద్ద ఉండటం అతనికి మోటర్‌ బైక్‌లను ఉన్న ప్రేమకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement