భవిష్యత్ గురించి అతిగా ఆలోచించను: రహానే | Looking too far ahead into the future can clutter your mind: Ajinkya Rahane | Sakshi
Sakshi News home page

భవిష్యత్ గురించి అతిగా ఆలోచించను: రహానే

Sep 3 2016 12:41 AM | Updated on Sep 4 2017 12:01 PM

భవిష్యత్ గురించి అతిగా ఆలోచించను: రహానే

భవిష్యత్ గురించి అతిగా ఆలోచించను: రహానే

భవిష్యత్ గురించి అతిగా ఆలోచిస్తే మనసు పాడవుతుందని భారత క్రికెటర్ అజింక్యా రహానే అన్నాడు. ముందుగానే లక్ష్యాలు విధించుకోవడం...

న్యూఢిల్లీ: భవిష్యత్ గురించి అతిగా ఆలోచిస్తే మనసు పాడవుతుందని భారత క్రికెటర్ అజింక్యా రహానే అన్నాడు. ముందుగానే లక్ష్యాలు విధించుకోవడం నచ్చదని, వర్తమానంపైనే తన దృష్టి ఉంటుందని తేల్చి చెప్పాడు. టెస్టుల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న రహానే త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లో పాల్గొననున్నాడు. ‘మున్ముందు జరగబోయే మ్యాచ్‌ల గురించి ఇప్పటి నుంచే నేను ఎలాంటి లక్ష్యాలు విధించుకోలేదు. అలా ప్రయత్నిస్తే మనసు పాడవుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితి గురించే ఆలోచిస్తా. ఇప్పటికైతే నా దృష్టంతా న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌పైనే ఉంది’ అని రహానే అన్నాడు.  తాను ఎక్కడ ఆడినా ఒకే బరువు  బ్యాట్‌ను ఉపయోగిస్తానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement