చావోరేవో... | Life and death match | Sakshi
Sakshi News home page

చావోరేవో...

May 17 2015 1:34 AM | Updated on Sep 3 2017 2:10 AM

ఐపీఎల్ లీగ్ దశలో నేడు ఉత్కంఠభరిత క్లైమాక్స్ పోరు జరగబోతోంది. ఉప్పల్‌లో నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.

ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్ నేడు
గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు


 సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ లీగ్ దశలో నేడు ఉత్కంఠభరిత క్లైమాక్స్ పోరు జరగబోతోంది. ఉప్పల్‌లో నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. రెండు జట్లూ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్ల చొప్పున సాధించాయి. వార్నర్, ధావన్, హెన్రిక్స్‌ల ఫామ్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు చేతిలో జరిగిన ‘పొట్టి’ మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని మినహాయిస్తే సన్‌రైజర్స్ వరుస విజయాలతో జోరు మీదే ఉంది. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

 మరోవైపు ముంబై జట్టు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాపై అనూహ్య విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలబడింది. సిమ్మన్స్, పొలార్డ్, రోహిత్‌లతో పాటు కొత్త సంచలనం హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు కీలకం. బౌలింగ్‌లో మలింగ, మెక్లీన్‌గన్‌లతో పాటు హర్భజన్ రాణించాల్సి ఉంది. మొత్తం మీద రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో చివరి లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement