పేస్ జోడిదే టైటిల్ | Leander Paes wins first title of season in Leon Challenger tournament | Sakshi
Sakshi News home page

పేస్ జోడిదే టైటిల్

Apr 2 2017 3:50 PM | Updated on Sep 5 2017 7:46 AM

పేస్ జోడిదే టైటిల్

పేస్ జోడిదే టైటిల్

భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ సీజన్ లో తొలి టైటిల్ ను సాధించాడు.

లియోన్(మెక్సిక్)  భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ ఈ సీజన్ లో తొలి టైటిల్ ను సాధించాడు. లియాన్ ఛాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఆదిలో శంషుద్దీన్(కెనడా)తో కలిసి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో 6-1, 6-4 తేడాతో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్‌)–కారో జాంపియిరి (బ్రెజిల్‌) జంటపై పేస్ ద్వయం గెలిచింది. ఏకపక్షంగా సాగిన పోరులో లియాండర్-ఆదిల్లు ఆద్యంత ఆకట్టుకున్నారు.

 

ప్రత్యర్థి జోడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను గెలుచుకున్నారు. ఇది పేస్ కెరీర్లో 20వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్ కాగా, గత 26 ఏళ్ల నుంచి ప్రతీ ఏడాది కనీసం ఒక్క టైటిల్ ను అయినా గెలిచే ఆటగాళ్ల అరుదైన జాబితాలో పేస్ చేరిపోయాడు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement