తుది పోరుకు పేస్‌ జోడీ | Leander Paes in line for first title of the season at Leon Challenger | Sakshi
Sakshi News home page

తుది పోరుకు పేస్‌ జోడీ

Apr 2 2017 1:24 AM | Updated on Sep 5 2017 7:41 AM

భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ఈ ఏడాది తొలి టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు.

లియోన్‌ (మెక్సికో): భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ఈ ఏడాది తొలి టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. లియోన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి ఆదిల్‌ శంషుద్దీన్‌ (కెనడా)తో కలిసి పేస్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో మూడో సీడ్‌ పేస్‌–ఆదిల్‌ జంట 6–7 (1/7), 6–4, 10–5తో లూక్‌ సవిల్లీ–జాన్‌ పాట్రిక్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. ఫైనల్లో లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్‌)–కారో జాంపియిరి (బ్రెజిల్‌) జంటతో పేస్‌ ద్వయం తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement